prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 8:59 pm Digital Edition : PRAJA VANI

నిరంతరాయంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు

*నిరంతరాయంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు*

* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

టిఎన్జీవో సభ్యత నమోదు కార్యక్రమం జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతుండగా, గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో అటవీ శాఖలో పనిచేస్తున్న దాదాపు 43 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో మిగిలిన యూనిట్లలో సైతం సభ్యత్వ నమోదును అతి త్వరలో పూర్తి చేసి, రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని, రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, అటవీశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.