prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 9:15 pm Digital Edition : PRAJA VANI

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్‌గా శ్రీజా రెడ్డి బాధ్యతల స్వీకరణ

*నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్‌గా శ్రీజా రెడ్డి బాధ్యతల స్వీకరణ..!*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్‌గా శ్రీజా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత జిల్లాలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నల్లగొండ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటు లో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, నల్లగొండపై తనకు పూర్తి అవగాహన ఉందని శ్రీజా రెడ్డి పేర్కొన్నారు.