prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 9:30 am Digital Edition : PRAJA VANI

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలిఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలిఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం

* మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి

జమ్మికుంటనవంబర్ 18 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం లో ఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారుఈ సందర్భంగా బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా అధికారులు ముందస్తు తక్షణ చర్యలుతీసుకోవాలనికోరారుధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు తూకం యంత్రాలు ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితిని నివారించాలని అన్నారురైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో రైతుల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారురైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, ఇంగ్లే ప్రభాకర్, చింతల ఐలయ్య,గుడికందుల పావని,జోడు సంపత్, గురుకుంట్ల సంజీవ్,రావుల అశోక్, శనిగరపు శ్రవణ్, వడ్లకొండ జలపతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.