దళిత జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కగల్ల యాదన్న
• ప్రధాన కార్యదర్శిగా వరిగుంతం శంకర్ నియామకం
సంగారెడ్డి | నవంబర్ 19 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
దళిత జర్నలిస్టుల ఫోరం ( దళిత జర్నలిస్ట్ ఫోరం) 11వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కగల్ల యాదన్న, ప్రధాన కార్యదర్శిగా వరిగుంతం శంకర్‌ను నియమించినట్లు దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్ ప్రకటించారు.
నూతన బాధ్యతలు అప్పగించిన కాశపోగు జాన్‌కు అధ్యక్షుడు ముక్కగల్ల యాదన్న, ప్రధాన కార్యదర్శి వరిగుంతం శంకర్ సామాజిక ఉద్యమాభివందనాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎలాంటి రాగద్వేషాలకు తావులేకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా దళిత జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన, ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. దళిత జర్నలిస్టు ఫోరం సంస్థ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దళిత జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.