*దంతాలపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఇందిరమ్మ109వ జయంతి వేడుకలు*
*ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్తలు*
*ఇందిరాగాంధీ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం చేకూరింది*
*మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, కొడుపు గంటి హరికృష్ణ*
దంతాలపల్లి
నవంబర్ 19 (ప్రజావాణి)
భారత మాజీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు దంతాలపల్లి మండల కేంద్రంలో, అంబేద్కర్ విగ్రహ వద్ద, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల పోరం అధ్యక్షులు ఆక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొడుపు గంటి హరికృష్ణ మాట్లాడుతూ, భారతదేశం మొదటి మహిళా ప్రధాని ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించుకోవడం, మన పార్టీకి ఎంతో గర్వకారణం అన్నారు. ఇందిరాగాంధీ తాను మహిళ ప్రధానిగా కొనసాగుతున్నప్పుడు
దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని వారు తెలిపారు. దేశంలో ఆమె తీసుకువచ్చిన సంస్కరణల వల్ల అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం చేకూరిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు దేశ ప్రజల గుండెల్లో ఇందిరా గాంధీ ఆశయాలు, కొనసాగుతున్నాయి అంటే, దేశ ప్రజల పట్ల ఆమె అంకితభావం తో పనిచేసిన సేవా కార్యక్రమాలు నిలువెత్తు నిదర్శనం ఉండడమే, దీనికి కారణం అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఆశయాలు, స్మరించుకుంటూ దేశ భవిష్యత్తు కోసం, ఆమె యొక్క సేవలు నిరంతరం కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, దంతాలపల్లి సర్పంచ్ పొన్నోటి బాలాజీ, వేములపల్లి సర్పంచ్ గుమ్మడవెల్లి రవి, తూర్పు తండా సర్పంచ్, పొట్య నాయక్ ,పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము, ,యూత్ కాంగ్రెస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సురేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సంపేట సురేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.