జల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన.. పాఠశాల అసెంబ్లీలో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ
జల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన.. పాఠశాల అసెంబ్లీలో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ పోత్కపల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం పోత్కపల్లి, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: రానున్న రోజుల్లో నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు పి. భద్రయ్య ఆధ్వర్యంలో పాఠశాల ఉదయం అసెంబ్లీలో జల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం...