జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఘనంగా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి...