prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 5:19 pm Digital Edition : UPENDHAR JANAGON

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఘనంగా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

డీసీసీ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హఠావో నినాదం, భూసంస్కరణలు వంటి పథకాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తుచేశారు.

దేశం పట్ల ఆమెకున్న అంకితభావం, ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆదర్శమని తెలిపారు. ఇందిరమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేశ్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు కటకం ఉదయ్ కుమార్, సేవాదళ్ జిల్లా పట్టణ అధ్యక్షుడు కవిడే శ్రీనివాస్, సేవాదళ్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ షరీఫ్, జిల్లా కార్యదర్శి మోతే మల్లేశ్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాపోతుల ఉప్పలయ్య, సేవాదళ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ దూపటి రాజు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.