గండి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 18(ప్రజావాణి ): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త గండి యాదయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేడు వారి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా గండి యాదయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం అందించారు.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన యాదయ్య గారి మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, సర్పంచ్ భాషిపాక రాములు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, ఎలా సుందర్, ఫాక్స్ వైస్ చైర్మన్ నక్క రమేష్, ఉపసర్పంచ్ నక్క రేణుక కొమురయ్య, మాజీ ఉపసర్పంచ్ కాసబోయిన నగేష్, మాజీ వార్డు సభ్యులు సూలుగురి మహేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.