కంగ్టి ఎంపీడీఓగా సుభాష్ చంద్రగౌడ్ బాధ్యతల స్వీకరణ
కంగ్టి, నవంబర్ 19 (ప్రజావాణి): తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రగౌడ్ బదిలీపై కంగ్టి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.