prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 11:34 am Digital Edition : PRAJA VANI

ఎటపాకలో వాటర్ ప్లాంట్ లపై అధికారుల నిఘా ఏది?

ప్రజావాణి పత్రిక – ప్రత్యేక కథనం.

ఎటపాకలో. వాటర్ ప్లాంట్ లపై. అధికారుల నిఘా ఏది?
మన ప్రజావాణి!నవంబర్ 19! ఎటపాక మండలం

ఎటపాక : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన వాటర్ ప్లాంట్ నిర్వహణపై అనేక అనుమానాలు. వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయి? వాటిలో ఎన్ని ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్నాయి? ఎన్ని ప్లాంట్లు నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు? అనే ప్రశ్నలకు స్థానిక ప్రజల్లో చర్చ నీయంగా మారాయి..
ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన తాగునీటి వ్యాపారంలో నాణ్యత ప్రమాణాలు పాటించటం అత్యంత కీలకకం…ప్లాంట్లు నిర్వహణకు FSSAI లైసెన్స్. స్థానిక సంస్థల అనుమతులు.
వర్తించే ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి నీటి శుద్ధి ప్రక్రియ నిలవ ట్యాంకులు వాటర్ క్యాన్లు పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అయితే ఎటపాక మండలంలోని నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ లపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారా? నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించి నాణ్యత పరీక్షిస్తున్నారా? TDS స్థాయిలను పరిశీలిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
వాటర్ ప్లాంట్ నిర్వహణపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది అనుమతులు లేని ప్లాంట్లు ఉంటే గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి..
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర.తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత కావాలి. వాటర్ ప్లాంట్ల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా. అధికారులు చర్యలు తీసుకోవాలి