ఎంపీడీవో ను కలిసిన కాంగ్రెస్ నేతలు..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలానికి ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన తోట హరీష్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ సర్పంచులు నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపీడీవోకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గంజి రాజేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు భూక్య మీటు నాయక్,లక్ష్మీ వెంకన్న,ముదీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరేష్,వెంకన్నఎన్ ఎస్ వి ఐ మండల ప్రెసిడెంట్ నాగేల్లీ సుధీర్,ప్రభాకర్ తదితరులు ఉన్నారు.