ఉత్కంఠ పోరులో సమ్మక్క సారక్క టీం ఘన విజయం
ఉత్కంఠ పోరులో సమ్మక్క సారక్క టీం ఘన విజయం పరకాల: పరకాల మండలంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. పరకాల నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి జట్లు ఏర్పడి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. గ్రామీణ క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు యువతలో ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో సమ్మక్క సారక్క టీం అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా...