prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 7:16 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

తొర్రూరు పట్టణ
కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

 

తొర్రూరు
నవంబర్ 19(ప్రజావాణి)

 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లు అన్నారు. పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు డివిజన్ కేంద్రంలోని , కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.పేదల సంక్షేమం,సామాజిక న్యాయం, దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ్ ఐక్యత, సమగ్రత అభివృద్ధి కోసం చేసిన కృషి భావితరాలకు పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిటి సధాకర్, చిత్తలూరు శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కోశాధికారి జక్కన్న మహబూబ్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, నాయకులు అచ్చిరెడ్డి, ఎనగందుల శ్రీనివాస్, కర్ర అశోక్ రెడ్డి, బసనబోయిన మహేష్, యాదవ్,మహమ్మద్ జలీల్, బిజ్జాల అనిల్, వల్లపు యాకన్న, అజ్మీర రమేష్,తాళ్ళపెల్లి బిక్షం,భూసాని రాము,సట్ల నాగలక్ష్మి,జంజీరాల మనోహర్, తాటికాయలరాణి, మంజుల సిరికొండ భవాని,యశోద,హరిత,భూతం భరత్,పిట్టల చింటూ,మందపురి శ్రీధర్,గంగాధర్ యాకాంబరం,పంజాల అల్లూరు,నరేష్,యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.