prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 9:13 pm Digital Edition : PRAJA VANI

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారె….అర్హులకు సంక్షేమ పథకాల అందజేత

*అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారె….అర్హులకు సంక్షేమ పథకాల అందజేత*

*రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన*

*రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ నూతన విగ్రహాల ఆవిష్కరణ*

*76 మంది లబ్ధిదారులకు రూ.57.71 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందజేత*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 19

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా రింగ్ రోడ్డు సెంటర్‌లో రోడ్డు విస్తరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు పట్టణంలో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా రహదారుల విస్తరణతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు
అనంతరం అదే సెంటర్‌లో భారత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ. ఇందిరా గాంధీ. నూతన విగ్రహాలను ఆవిష్కరించారు దేశ అభివృద్ధికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు
తదుపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 31 మంది లబ్ధిదారులకు రూ.9,66,400 విలువైన చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 48 మంది లబ్ధిదారులకు రూ.48,05,568 విలువైన చెక్కులను పంపిణీ చేశారు
మొత్తం 76 మంది లబ్ధిదారులకు రూ.57,71,968 ఆర్థిక సాయం అందజేశారు అనారోగ్యంతో బాధపడుతున్న సామాన్య కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తుండగా ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ. వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు. జూపల్లి ప్రమోద్. కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు,