prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 10:14 am Digital Edition : UPENDHAR JANAGON

అబ్బయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

 

అబ్బయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి):జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందరికీ ఆప్తులు అయిన బొబ్బల అబ్బయ్య  అనారోగ్య కారణాలతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేసిన అబ్బయ్య గారి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటు అని నాయకులు పేర్కొన్నారు.

గురువారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు  ఆదేశానుసారం, ఉమ్మడి ధర్మపురం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి, అబ్బయ్య  మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.