కడప జిల్లాలో బీజేపీ బోణీ: బద్వేల్ మండలం రాజుపాలెంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఎన్నిక!
బద్వేల్నవంబర్18ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీతన రాజకీయ ఖాతాను ఘనంగా తెరిచింది.జిల్లా పరిధిలోని బద్వేల్ మండలం రాజుపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారుడు,ప్రముఖ స్థానిక నేత శ్రీ బొమ్మన సుబ్బరాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా సర్పంచ్ ఎన్నికల బరిలో బీజేపీకి ఇది తొలి విజయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.బద్వేల్ నియోజకవర్గంలోనే మొట్టమొదటి సర్పంచ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం పట్ల కమలం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోటీ...