prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:21 pm Digital Edition : PRAJA VANI

416 మంది లబ్ధి దారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ…

*416 మంది లబ్ధి దారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ…*

*అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.*

*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18*

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో బుధ వారం రోజు నిర్వహించిన కార్యక్రమంలో మండ లానికి చెందిన 416 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద , మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తోంది. సమాజం లో ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు , వితంతువులు, దివ్యాంగులు , ఒంటరి మహిళలకు చేయూత నివ్వాలనే ఉద్దేశంతో నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాం. మోట కొండూరు మండలంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పెన్షన్లు వారి కుటుంబా లకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం , రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అంది స్తున్నాం. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం , రైతు రుణమాఫీ ద్వారా రుణభారం నుంచి విముక్తి కల్పించాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా మన్నారు. అలాగే పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ , మహి ళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం , నిరుపేద ఆడబిడ్డల వివా హాలకు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల అవసరాలకు అను గుణంగా సంక్షేమ పథ కాలను అమలు చేస్తున్నాం. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజా ప్రతినిధిగా , ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిరంతరం కృషి చేస్తాను. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అందు బాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్య కర్తలు , అధికారులు , లబ్ధి దారులు తదితరులు పాల్గొన్నారు.