సీఎం సభను విజయవంతం చేయాలని నీలం మధు ముదిరాజ్ పిలుపు
సీఎం సభను విజయవంతం చేయాలని నీలం మధు ముదిరాజ్ పిలుపు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు పటాన్చెరు, నవంబర్ 18 (ప్రజావాణి): సిద్దిపేటలో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో సీఎం సభ నిర్వహించనున్న ప్రాంగణాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఇన్చార్జి పూజల హరికృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున...