prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 10:53 am Digital Edition : PRAJA VANI

సంవిధాన్ రక్షా మార్చ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న భోంస్లే నారాయణరావు పటేల్

*సంవిధాన్ రక్షా మార్చ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న భోంస్లే నారాయణరావు పటేల్*

*ఏఐసీసీ ఆదేశాల మేరకు నవంబర్ 26న హైదరాబాద్‌లో భారీ కార్యక్రమం.. జూమ్ సమావేశంలో పాల్గొన్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 17:-
ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళవారం జూమ్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భోంస్లే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, టీపీసీసీ అబ్జర్వర్లు, ఎస్‌ఐఆర్ అసెంబ్లీ కోఆర్డినేటర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు చర్చించినట్లు తెలిపారు. ఈ ముఖ్యమైన సమావేశంలో భోంస్లే నారాయణరావు పటేల్ పాల్గొనడం ద్వారా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమ సన్నాహాల్లో భాగస్వాములయ్యారు.