prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 8:36 pm Digital Edition : PRAJA VANI

విద్యుత్ తీగలతో ట్రాక్టర్‌కు మంటలు

విద్యుత్ తీగలతో ట్రాక్టర్‌కు మంటలు!
* వరి గడ్డి దగ్ధం.. రైతుకు రూ.60 వేల నష్టం
* సమయానికి చేరుకోని అగ్నిమాపక వాహనం?
* కన్నీరు మున్నీరవుతున్న రైతు

నేలకొండపల్లి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా నే
లకొండపల్లి మండ్రాజుపల్లి గ్రామంలో విద్యుత్ తీగలు రైతు కొంపముంచాయి. పొలం నుంచి ట్రాక్టర్‌ ట్రక్కులో వరి గడ్డిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రాక్టర్‌ ట్రక్కుతో పాటు అందులోని వరి గడ్డి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రైతు గుండు కృష్ణయ్యకు సుమారు రూ.60 వేల మేర ఆస్తినష్టం వాటిల్లింది.

ట్రక్కు విలువ సుమారు రూ.50 వేలు కాగా, దానిలోని వరి గడ్డి విలువ మరో రూ.10 వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక వాహనం సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నష్టం కొంతమేర తగ్గి ఉండేదని వాపోయారు. పంట అవశేషాలను తరలించే సమయంలో జరిగిన ఈ ప్రమాదం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది.