రౌడీలతో మద్యం విక్రయాలు..? బెల్ట్ షాపుల తనిఖీలు రౌడీల పనా..

*రౌడీలతో మద్యం విక్రయాలు..? బెల్ట్ షాపుల తనిఖీలు రౌడీల పనా..?* ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 18 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మద్యం విక్రయాల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ వినియోగదారులను దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇతర ప్రాంతాల షాపుల నుంచి మద్యం తెచ్చుకున్న వారిని బెదిరిస్తూ, దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణలో...