-మిర్యాలగూడలో ఘనంగా నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
*-2200 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR*
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18
మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతి నందు ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-BLR ఆధ్వర్యంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు…
ఈ కార్యక్రమంలో *మిర్యాలగూడ మండలం, దామరచర్ల మండలం, అడవిదేవులపల్లి* మండలాలకు చెందిన మొత్తం *2,200 మంది* అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR మాట్లాడుతూ…. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వారికి చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనానికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. .. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లు, కార్యదర్శి లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.