భూ సరిహద్దుల వివాదాలకు చెక్
◦ రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త రీ-సర్వే
అశ్వరావుపేట, నవంబర్ 18 (మన సమగ్ర ప్రజావాణి):అశ్వారావుపేట మండల పరిధిలోని కన్నాయిగూడెం, అనంతరం, గండ్లగూడెం, బచ్చువారిగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న భూముల సరిహద్దులను (బౌండరీ లైన్స్) స్పష్టంగా నిర్ణయించేందుకు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా రీ-సర్వే చేపట్టారు. దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దుల స్పష్టత కోసం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు, 152 రీ సర్వే కి సంబంధించిన భూములను కొలతలు వేసి సరిహద్దు రాళ్లను (బౌండరీ లైన్స్) ఫిక్స్ చేశారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయంతో జరిగిన ఈ సర్వే ద్వారా ప్రభుత్వ, అటవీ మరియు రైతుల భూముల హద్దులపై పూర్తి స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ రీ-సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జా శంకరరావు, తహసీల్దార్ (ఎమ్మార్వో) దాసరి కిషోర్, అటవీ శాఖ ఎఫ్ఎస్ఓ టి. రాము, బీట్ ఆఫీసర్ అరుణ, ఆర్ఐ కృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, జీపీఓ ఉషారాణి, లైసెన్స్‌డ్ సర్వేయర్లు తో పాటు ఆయా గ్రామాల పెద్దలు, రైతులు పాల్గొన్నారు.