*భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మానవత్వానికే మచ్చ…!*
*మార్చురీ పక్కనే మృత దేహాల దహనం.*
*ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజా ఆగ్రహం..!*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18*
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఘటన చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో మృతి చెందిన వారి మృత దేహాలను గౌరవప్రదంగా అంత్యక్రియలకు తరలించాల్సింది పోయి, మార్చురీ పక్కనే దహనం చేసినట్లు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల పట్ల ఇంతటి నిర్లక్ష్యమా..? చనిపోయిన వారికి కూడా గౌరవం లే కుండా వ్యవహరించడం ఏంటి..? భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బందికి బాధ్యత లేదా..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనమా..? ఈ వ్యవ హారం పై ఆసుపత్రి ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? మృతదేహాల దహనం వెనుక ఆసుపత్రి డాక్టర్ల హస్తం ఏమైనా ఉందా..? అధికార నాయకుల ఒత్తిడితోనే ఇలా చేశారా..? అసలు మృత దేహాలను దహనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? దీనికి బాధ్యులెవరు..?
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి , ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి. బాధ్యులుగా తేలిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు న్యాయం చేయలేకపోయినా , కనీసం చనిపోయిన వారి మృతదేహాలకైనా గౌరవం ఇవ్వాలి. ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం మరింత సన్నగిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.