prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 5:01 pm Digital Edition : PRAJA VANI

పేదలకు ఆర్థిక భరోసానే ప్రభుత్వ ధ్యేయం

పేదలకు ఆర్థిక భరోసానే ప్రభుత్వ ధ్యేయం

• 460 మందికి నూతన ‘చేయూత’ పింఛన్ల మంజూరు

• ప్రొసీడింగ్స్ అందజేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

వాజేడు, నవంబర్ 18 (ప్రజావాణి): అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు కలిపి మొత్తం 460 మందికి నూతనంగా ‘చేయూత’ పింఛన్లు మంజూరయ్యాయి.
బుధవారం వాజేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే తన ధ్యేయమని, అర్హులైన వారందరికీ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని, లబ్ధిదారులు ఆ నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కృపాకర్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.