*పాండాల రవి గౌడ్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన నాయకులు*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 18 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మన్నెగూడ మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో ఆరుట్ల గ్రామానికి చెందిన పాండాల రవి గౌడ్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆరుట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహ గౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్య గౌడ్ హాజరై నూతన దంపతులు సౌమ్య, వినోద్ కుమార్ గౌడ్లను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి గ్రూప్ సభ్యుడు పల్లె శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమర్ల శేఖర్, క్రాంతి కుమార్, ఉపాధ్యాయుడు మాధగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.