పదవి కోసం కాదు.. ప్రజల కోసం! మక్కపేట సర్పంచ్ బరిలో గుడేటి మధు
మక్కపేట నవంబర్ 18 మన ప్రజావాణి
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేటలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైంది. బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుడేటి మధు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.
గ్రామంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా బరిలోకి దిగిన గుడేటి మధు.. పదవి కోసం కాదు.. ప్రజల కోసం, రాజకీయాల కోసం కాదు.. గ్రామ అభివృద్ధి కోసం అంటూ ముందుకు సాగుతున్నారు.
గ్రామ సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించడమే లక్ష్యంగా తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈసారి ఓటు వ్యక్తికి కాదు.. గ్రామ భవిష్యత్తుకు! మార్పు కావాలంటే గుడేటి మధుకే మద్దతు ఇవ్వాలన్న పిలుపు మక్కపేటలో వినిపిస్తోంది.