పట్టభద్రుల సమస్యలపై జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్
పట్టభద్రుల సమస్యలపై జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ విద్యాసంస్థలు, గ్రంథాలయాలను సందర్శించి నిరుద్యోగ యువత, పట్టభద్రుల సమస్యలపై ఆరా కూసుమంచి, నవంబర్ 17 (ప్రజావాణి): ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా చేపట్టిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార వాహనం మంగళవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించింది. ఈ సందర్భంగా కూసుమంచిలోని ప్రసిద్ధ కాకతీయ గణపేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరు, నాయకన్‌గూడెం, జుజ్జులరావుపేట, గురవాయిగూడెం,...