prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:02 pm Digital Edition : PRAJA VANI

నైనాలలో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్.. ప్రారంభించిన సర్పంచ్

నైనాలలో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్..
ప్రారంభించిన సర్పంచ్
ప్రజావాణి,నెల్లికుదురు: అయినాల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశువుల గర్భధారణ చికిత్స శిబిరం నిర్వహించారు.స్థానిక సర్పంచి యాసం సంధ్య రమేష్ హాజరై సంబంధిత ఫెర్టిలిటీ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఎల్ నినో ప్రభావం నుంచి పశువులను కాపాడుకోవడానికి వీబిజీ రాంజీ పథకంలో గడ్డి పెంచుకోవచ్చన్నారు.ప్రోత్సాహంగా ఈ పథకం ద్వారా ఎకరాకు రూ.14,000 పొందవచ్చు అని తెలిపారు. దీనిని పాడి రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు.కార్యక్రమం లో వెటర్నరీ డా.సోమ శ్రీనివాస్. గోపాలమిత్ర సూపర్వైజర్ రఘు వీర్.గోపాలమిత్రలు సత్యనారాయణ.కుమార్, ఎల్ ఎస్ ఏ లు రాజేష్, వాల్య,సిబ్బంది శోభన్,హరీష్ రైతులు పాల్గొన్నారు.