prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 8:33 pm Digital Edition : PRAJA VANI

నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు, జంగిల్ కటింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు, జంగిల్ కటింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం,
నెల్లుట్ల గ్రామంలో చెరువు మత్తడి మరమ్మతు మరియు చెరువు కట్టపై జంగిల్ కటింగ్ పనులను గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెరువు కట్టపై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా, రైతులకు కోతుల బెడద కూడా తగ్గుతుందని తెలిపారు. చెరువు మత్తడి మరమ్మతు వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, రైతులకు సాగునీటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఈ అభివృద్ధి పనుల కోసం రూ. 20 లక్షల నిధులను మంజూరు చేసినందుకు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి కి సర్పంచ్, గ్రామ పాలకవర్గం మరియు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈ లు కిషోర్ రెడ్డి, నరేందర్, ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్,
వార్డు సభ్యులు వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, బొజ్జం సునీత ప్రభాకర్, బత్తిని వేణు, కొమ్మరాజుల రేణుక కొమ్మురయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయకులు కొయ్యడ రామలింగం తదితరులు పాల్గొన్నారు.