prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:48 pm Digital Edition : PRAJA VANI

నెల్లికుదురు మండల ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం

నెల్లికుదురు మండల ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లో మండల ఆర్యవైశ్య సామాజిక వర్గం సమావేశమై సంబంధిత మండల కమిటీని ఎంపిక చేశారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులుగా పెన్నాకుల ఉపేందర్, గౌరవ అధ్యక్షులుగా వెన్నాకుల పెద్ద శ్రీను,కార్యదర్శిగా మాసెట్టి నవీన్ కుమార్, కోశాధికారి బచ్చు నాగేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు నాళ్ళ శ్రీనివాస్, గుమ్మడవెల్లి మనోహర్, సహాయ కార్యదర్శిలు చీమకుర్తి రమేష్,మాడుగుల వీరన్న నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శీలం సోమన్న,టి.వాసు, గోరంట్ల గణేష్,వేషాల నాగన్న,సలహాదారులు గా కొండె సత్యనారాయణ,నంగునూరు శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.

హక్కులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..

ఆర్యవైశ్య సంఘం మండల కార్యవర్గ నూతన అధ్యక్ష కార్యదర్శులు ఉపేందర్, మాసెట్టి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల హక్కులు,సమస్యల పరిష్కారానికి కమిటీతోపాటు,సీనియర్ ఆర్యవైశ్య సంఘ నాయకుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.