prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:48 pm Digital Edition : PRAJA VANI

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి

రైతుల ప్రయోజనాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18

యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షేండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారని, వారికి సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యంగా నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా 9వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ దపెదర్ రాజు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మండల మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.