నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్సై రమేష్ బాబు
తవణంపల్లి, నవంబర్ 18 (మన ప్రజావాణి):
తవణంపల్లి మండల కేంద్రంలోని స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎస్సై రమేష్ బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎగువ తవణంపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
అనంతరం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.