prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 10:28 am Digital Edition : PRAJA VANI

నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం: ఎమ్మెల్యే కసిరెడ్డి

*నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం: ఎమ్మెల్యే కసిరెడ్డి*

ప్రజావాణి,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 18.రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఏ ఒక్క తెలంగాణ కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.