ధర్మారం మండలంలోని శీతల చెరువు వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో పోలీసులు దాడి నిర్వహించి, సుల్తానాబాద్ గ్రామం జవహర్ నగర్‌కు చెందిన వేముల శ్రీనివాస్ (53)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 204 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ తెలిపారు.