prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:55 am Digital Edition : MAHESH MEDCHAL

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులందరూ ఐక్యంగా కలిసి సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు పొంగిపొర్లుతూ కాలనీలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి బ్యాంక్ కాలనీలో డ్రైనేజీ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.