prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 9:58 am Digital Edition : PRAJA VANI

ఘనంగా ముగిసిన ఎంజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా బాలికల క్రీడోత్సవాలు

ఘనంగా ముగిసిన ఎంజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా బాలికల క్రీడోత్సవాలు

విజేతలకు బహుమతుల ప్రదానం.. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి జిల్లా విద్యాధికారి వెంకటగిరి రాజు గౌడ్

ప్రజావాణి నవంబర్ 17 కమలాపూర్ మండల్

మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్‌-14 అండర్‌-19 బాలికల క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన క్రీడా పోటీలు మూడు రోజులపాటు విద్యార్థినుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగి 17వ తేదీన ముగింపు వేడుకలతో విజయవంతంగా ముగిశాయి

ముగింపు కార్యక్రమానికి హనుమకొండ జిల్లా విద్యాధికారి వెంకటగిరి రాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు

బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు

ఈ క్రీడోత్సవాల్లో కబడ్డీ ఖోఖో చెస్‌ వాలీబాల్‌ టెన్నికాయిట్‌తో పాటు లాంగ్‌జంప్‌ హైజంప్‌ షాట్‌పుట్‌ డిస్కస్‌త్రో అథ్లెటిక్స్‌ విభాగాల్లో అండర్‌-14 అండర్‌-19 కేటగిరీల్లో పోటీలు నిర్వహించినట్లు హోస్ట్ పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ ఎంజేపీ ఓఎస్‌డీ మనోహర్ రెడ్డి, జిల్లా డీసీఓ స్టెల్లా ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్ కవితరెడ్డి ఉపాధ్యాయులు పీడీలు పీఈటీలు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు