గూడెం గ్రామంలో పర్యటించిన మిషన్ భగీరథ అధికారులు.. నిరంతర నీటి సరఫరాకు చర్యలు
బెజ్జంకి,నవంబర్ 18 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా బుధవారం మిషన్ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ అనిత గ్రామాన్ని సందర్శించి,తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిశీలించి, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ అధికారుల దృష్టికితీసుకెళ్లారు.సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గ్రామ ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే గ్రామపంచాయతీ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మెరుగు యాదగిరి,గ్రిడ్ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.