కంఠాలి లో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ చేసిన సర్పంచ్ నాగనాథ్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి నవంబర్ 18
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్లు 18 మందికి మంజూరయ్యాయి. గ్రామంలో మొత్తం 22 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా,వారిలో 18 మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. మంజూరైన పెన్షన్ పత్రాలను బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నాగనాథ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మురళి పటేల్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.