prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:46 pm Digital Edition : MAHESH MEDCHAL

ఐజేయూ కౌన్సిల్‌లో తిరుపతి నాయక్, జాకట రాకేష్‌కు చోటు

*ఐజేయు కౌన్సిల్‌లో తిరుపతి నాయక్, జాకట రాకేష్‌కు చోటు

*ఐజేయూ కౌన్సిల్‌లో తిరుపతి నాయక్, జాకట రాకేష్‌కు చోటు*

మేడ్చల్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ, తెలంగాణ కౌన్సిల్ సభ్యులుగా ఇద్దరు జర్నలిస్టులు ఎంపికయ్యారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా తిరుపతి నాయక్ మాలోత్, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జాకట రాకేష్ ఎంపికయ్యారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం కోసం పనిచేస్తున్న ఐజేయూలో వీరికి అవకాశం లభించడంపై జర్నలిస్టు వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. పలువురు జర్నలిస్టు నాయకులు, సహచరులు వారికి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి నాయక్, జాకట రాకేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, యూనియన్ సలహాదారు క్రాంతి కిరణ్‌తో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, సంఘటిత ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.