ఎండపల్లి సోమేశ్వర వైన్స్‌లో అర్ధరాత్రి చోరీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ఎండపల్లి మండలంలోని స్థానిక సోమేశ్వర వైన్స్‌లో నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్‌ వెనుక భాగంలోని తలుపులను పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనం చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెల్గటూర్ స్టేషన్ ఎస్సై ఉదయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆనవాళ్ల కోసం క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలను సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.