prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:21 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన
దండేపల్లి, నవంబర్ 18 (ప్రజావాణి): దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్, ఎంపీవో కే.వి. ప్రసాద్, ఏపీవో దుర్గాదాస్ హాజరై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించి, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన వారందరికీ పథకం గురించి తెలియజేయాలని కోరారు.
అదేవిధంగా వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పథకం (VBGRAM-G) పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించి, పనుల నిర్వహణను వేగవంతం చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు.