*ఆరుట్ల, లోయపల్లిలో నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు హర్షణీయం*
*రైతులకు మరింత చేరువలో వ్యవసాయ సేవలు – డా. బాలకోటి నాయక్*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 18 (ప్రజావాణి):మంచాల మండలంలోని ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటు చేయడం హర్షణీయమని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి డా. బాలకోటి నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో నూతన వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల ఆయా గ్రామాల రైతులకు వ్యవసాయ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. రైతులు తమ అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గడంతో పాటు, వ్యవసాయానికి సంబంధించిన సేవలు సులభంగా పొందే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గతంలో పలుమార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా వినతులు సమర్పించినట్లు తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి నూతన సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొంటూ, ఈ సంఘాల ద్వారా ఆరుట్ల, లోయపల్లి గ్రామాల రైతులకు మరింత మెరుగైన సేవలు అందాలని ఆకాంక్షించారు. నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
– డా. ఎ. బాలకోటి నాయక్
రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి