prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 5:04 pm Digital Edition : PRAJA VANI

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్ల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్ల పంపిణీ
కమలాపూర్ రైతు వేదికలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ప్రజావాణి నవంబర్ 18
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన సామాజిక భద్రతా పింఛన్లను కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రైతు వేదికలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. గత పదేళ్లలో మంజూరు కాని పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అందిస్తోందంటూ పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుండె బాబు, తహసీల్దార్ సురేష్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి–రవీందర్, సీనియర్ నాయకులు మౌటం కుమారస్వామి, పొడేటి బిక్షపతి, బాలసాని రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడగాని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.