అర్హులకు పెన్షన్ల పంపిణీ
లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన మర్రిపల్లిగూడెం సర్పంచ్
ప్రజావాణి నవంబర్ 18
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో పింఛన్ల పంపిణీ ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ పత్రాలు అందజేశారు.
గత పదేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమకు పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో రైతు వేదిక ప్రాంగణం ప్రజల సందడితో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గూడెం సర్పంచ్ కదురు కవిత తిరుపతి గుండె బాబు, తహసీల్దార్ సురేష్ కుమార్ నాయకులు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడగాని రాజేష్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.