prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:50 pm Digital Edition : PRAJA VANI

అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం..

అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం..

(. పింఛన్ల మంజూరు పత్రాలు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. )

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గుండుర్ రోడ్డు సమీపంలో గల లక్ష్మి ఫంక్షన్ హాల్ లో బుధవారం రోజున జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ….. పథకాల అమలు తీరును వివరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గత పాలనలో అర్హులైన పలువురికి సంక్షేమ పథకాలు ఫలాలు అందలేదని అన్నారు.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.. ఆడపిల్లల వివాహాలకు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరాలని, ఏ ఒక్క పేద కుటుంబం లబ్ధికి దూరం కాకూడదని సృష్టం చేశారు.. సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే తెలిపారు…