అమీన్పూర్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం…
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన అమీన్పూర్ పోలీసులు
అమీన్పూర్, నవంబర్ 18 (ప్రజావాణి): అమీన్పూర్ పిఎస్ పరిధిలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్ఆర్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న సరిత(24) అనే మహిళ కుమార్తె అక్షిత (3) గురువారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కనిపించకుండా పోయింది. చిన్నారి తల్లి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.చిన్నారి కిడ్నాప్‌కు గురై ఉంటుందనే అనుమానాలతో అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రవీణ్ రెడ్డి బృందం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.