అతి చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా చక్రపాణి..!
పెద్ద కేసులను ఛేదిస్తున్న యువ హైకోర్టు న్యాయవాది…
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
పట్టుదల, అంకితభావం, న్యాయశాస్త్రంపై అపారమైన పట్టు ఉంటే వయసుతో సంబంధం లేకుండా అత్యున్నత విజయాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు యువ హైకోర్టు న్యాయవాది పుల్లబోట్ల విఎల్ఎస్ చక్రపాణి అతి చిన్న వయసులోనే న్యాయవాద వృత్తిని ఎంచుకున్న ఆయన, నేడు ఉన్నత న్యాయస్థానంలో హై కోర్టు ఎన్నో క్లిష్టమైన, కీలకమైన కేసులను సమర్థవంతంగా వాదిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు..
న్యాయవాద వృత్తిలో అద్భుత ప్రతిభ సాధారణంగా న్యాయవాద వృత్తిలో అనుభవం గడించడానికి చాలా ఏళ్లు పడుతుంది.. కానీ పుల్లబోట్ల
విఎల్ఎస్ చక్రపాణి తన పదునైన వాదనలతో, చట్టాలపై ఉన్న లోతైన అవగాహనతో అతి తక్కువ కాలంలోనే సీనియర్ న్యాయవాదుల సరసన నిలిచారు.. సివిల్, క్రిమినల్, రాజ్యాంగబద్ధమైన కీలక కేసులలో బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు..
న్యాయస్థానంలో ఆయన వినిపించే బలమైన వాదనలు ఎందరో కక్షిదారులకు (క్లయింట్స్) కొండంత భరోసానిస్తున్నాయి.. సామాన్యులకు సత్వర న్యాయం అందాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషి పట్ల తోటి న్యాయవాదులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప స్థాయికి చేరుకున్న పుల్లబోట్ల విఎల్ఎస్ చక్రపాణి నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
అడ్వకేట్ విఎల్ఎస్ చక్రపాణి న్యాయవాద ప్రతిభను ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, తెలంగాణ హైకోర్టులో దాఖలైన డబల్యు.పి. నెం.35403 అఫ్ 2026 ప్రత్యేకంగా ప్రస్తావించదగిన కేసుగా నిలుస్తుంది.. సైబర్ నేరానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఒక విద్యార్థికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా నిలిపివేయబడింది.. ఆ ఖాతాలోకి అనుమానాస్పద లావాదేవీ ద్వారా రూ.25,000 జమ అయినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.. అయితే, వివాదాస్పద మొత్తం రూ.25,000 మాత్రమే అయినప్పటికీ, మొత్తం బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడంతో విద్యార్థి తన ఇతర చట్టబద్ధమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ పుల్లబొట్ల విఎల్ఎస్ శ్రీచక్రపాణి, వివాదాస్పద మొత్తాన్ని మాత్రమే నిలుపుదల చేసి, మిగిలిన ఖాతా కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతించాలనే కీలకమైన న్యాయపరమైన అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ వాదనలకు మద్దతుగా మద్రాస్, కేరళ, తెలంగాణ హైకోర్టులలో వెలువడిన ఐదు న్యాయపూర్వ తీర్పులను ఆధారాలుగా సమర్పించారు.. బ్యాంకు ఖాతాను పూర్తిగా స్తంభింపజేయడం కంటే, దర్యాప్తు ప్రయోజనాలను కాపాడుతూ వివాదాస్పద మొత్తానికే పరిమితి విధించడం సముచితమనే వాదనను సమర్థంగా వినిపించారు.. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం పిటిషనర్‌కు గణనీయమైన ఉపశమనాన్ని కల్పించింది.. రూ.25,000 మొత్తంపై లియన్ కొనసాగిస్తూ, మిగిలిన లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాను తిరిగి వినియోగించుకునేందుకు అనుమతించాలని సంబంధిత బ్యాంకును హైకోర్టు ఆదేశించింది.. ఈ తీర్పు దర్యాప్తు ప్రయోజనాల పరిరక్షణతో పాటు వ్యక్తుల చట్టబద్ధమైన ఆర్థిక హక్కులను కూడా సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది..
చక్రపాణి న్యాయవాద ప్రయాణంలో సుప్రీంకోర్టు అనుభవం కూడా ఒక ముఖ్యమైన అంశం.. భారత ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన జస్టిస్ ఎన్.వి.రమణ కార్యాలయంలో ఇంటర్న్‌గా పనిచేసిన సమయంలో అడ్మిషన్ విషయాలపై సంక్షిప్త నోట్లు సిద్ధం చేయడం, బెయిల్ అంశాలు, ట్రాన్స్ఫర్ పిటిషన్లు, మధ్యవర్తిత్వ చట్టానికి సంబంధించిన నిబంధనలపై పరిశోధన చేయడం వంటి బాధ్యతలను నిర్వహించారు.. అలాగే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వద్ద కూడా ఇంటర్న్‌షిప్ ద్వారా న్యాయస్థాన కార్యకలాపాలపై విలువైన అనుభవాన్ని పొందారు.. అనంతరం అడ్వకేట్ ఎం.కె.జలీల్ వద్ద న్యాయవాద వృత్తికి సంబంధించిన అనుభవాన్ని పెంపొందించుకుని, గురుగ్రామ్‌లోని ఏస్ &ఏ లా ఆఫీసుస్ సంస్థలో డిస్ప్యూట్ రేసొల్యూషన్ విభాగంలో అసోసియేట్‌గా పనిచేశారు.. ఈ అనుభవాలు వివాద పరిష్కారం, కేసుల పరిశీలన, న్యాయపరమైన వ్యూహరచన వంటి అంశాల్లో ఆయనకు ప్రాయోగిక అవగాహనను అందించాయి..
