శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో ప్రమాదకరంగా మారిన కల్వర్టు!స్లాబ్ పూర్తిగా ధ్వంసం. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల ఆందోళన

పోరుమామిళ్ల,నవంబర్ 17(ప్రజావాణి న్యూస్) పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో ఉన్న కల్వర్టు స్లాబ్ పూర్తిగా పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై కల్వర్టు దెబ్బతిని పెద్ద గుంత ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై వెళ్లే వాహనదారులకు ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇదే రోడ్డులో పాఠశాల బస్సులు సైతం రాకపోకలు సాగిస్తుండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు! శ్రీరామ్...